Thursday, 29 April 2010

baby he loves you song lyrics from Arya2 Telugu Movie


Movie: Aarya2
Lyricist: Chandrabose
Singer: Devi Sri Prasad


చ… వాడికి నా మీద ప్రేమే లేదు
హి డసంట్ లవ్ మి యు నో.
నో. హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
అవునా.. ఎంత?
ఆ..
మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముదుపెట్టినప్పుడు జరిగినంత దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంతా
ఓఒ.. ఇంకా..

తెల్ల తెల్లవారు పల్లెటూరు లోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
చల్ల బువ్వ లోన నంజుకుంటూ తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్నఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు,హి లవ్స్ యు సో మచ్ ………. 2

అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నిన్గికున్ను వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తోనిగే గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగిసే నిప్పులాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు,హి లవ్స్ యు సో మచ్ ………. 2

పంటచేలలోని జీవమంత, గంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత, ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత రామలాలి అంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు,హి లవ్స్ యు సో మచ్ ………. 2

పచ్చి వేప పుల్ల చేదు అంత, రచబండ పైన వాధనంత
అర్ధమైన కాకపోయినా భక్తికొద్దీ విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత, ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు,హి లవ్స్ యు సో మచ్ ………. 2

అల్లరెకువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేల పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
బిక్కు బిక్కు మంటూ పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు,హి లవ్స్ యు సో మచ్ ………. 2

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తిరమంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే మా తీపి స్నేహమంత

బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు,హి లవ్స్ యు సో మచ్
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, ఐ లవ్ యు సో మచ్

Baby He Loves You Song Lyrics in English

Cha… vaadiki naa meeda preme ledhu
he doesnt love me u know.
No. he loves you. he loves you so much.
avuna.. entha?
aa..
modhati sari nuvvu nannu chusinappudu kaliginatti kopamantha
modhati sari nenu matladinappudu periginatti dweshamantha
modhati sari neku mudhupettinappudu jariginantha dhoshamantha
chivarisari neeku nijam cheppinapudu teerinatti bhaaramantha
Ooo.. inkaa..

tella tellavaru palletooru lona allukunna velugantha
pilla legadhooda notikantukunna aavu paala nuragantha
challa buvva lona nachukuntu thinna aavakaya kaaramantha
pelli eedukochi thulliaaduthunna aadapilla korikantha
Baby he loves you, he loves you, he loves you so much ………. 2

andamaina ne kaali kinda tirige nelakunna baruvantha
neeli neeli ne kallalona merise ningikunnu vayasantha
challanaina ne shwasalona tonige galikunna gathamantha
churrumanna ne choopulona egise nippulanti nijamantha
Baby he loves you, he loves you, he loves you so much ………. 2

pantachelaloni jeevamantha, gantasala paata bhavamantha
pandagochhinaa pabbamochhinaa vantashaalaloni vaasanantha
kumbhakarnudi niddarantha, aanjaneyudi aayuvantha
krishna moorthylo leelalantha raamalaali antha
Baby he loves you, he loves you, he loves you so much ………. 2

pachhi vepa pulla chedhu antha, rachabanda paina vaadhanantha
ardhamaina kakapoyina bhakthikoddi vinna vedhamantha
yeti neetiloni jaabilantha, yeta yeta vache jaatharantha
ekapathralo naatakalalo naatu golalantha
Baby he loves you, he loves you, he loves you so much ………. 2

Allarekkuvaithe kannathalli vese mottikaaya chanuvantha
jallupadda vela pongi pongi poose mattipoola viluvantha
bikku bikku mantu pareeksha raase pillagadi bhedhurantha
lakshamandinaina savalu chese aatagadi pogarantha
Baby he loves you, he loves you, he loves you so much ………. 2

entha daggaraina niku naku madhya unna anthuleni dhooramantha
entha cheruvaina nuvu nenu kalisi cheraleni thiramantha
entha orchukuna nuvu naku chese gnapakala gayamantha
entha gayamaina haayigane marche maa theepi snehamantha

Baby he loves you, he loves you, he loves you so much
Baby he loves you, loves you, I LOVE YOU so much

No comments:

Post a Comment

Popular Posts