Movie: Swarna kamalam
Lyricist: Sirivennela
Singers: S.P.Balu,P Susheela
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్ల మబ్బు కరగని .. చల్లని చిరుజల్లు …………. (2)
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు ……………… (2)
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు ఘల్లు ఘల్లు
లయకే నిలయమై నీ పాదం సాగాలి ...ఆహ హ హ హ హ
మలయానిల గతిలో సుమబాలగ తూగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి .. సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి .. ఆ ఆ ఆ … తిరిగే కాలానికి తీరొకటుంది..
అది నీ స్వార్ధానికి దొరకను అంది ..
నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సుర గంగకు విలువేముంది .. విలువేముంది ఘల్లు ఘల్లు
దూకే అలలకు ఏ తాళం వేస్తారు ...ఆహ హ హ హ హ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు ఉమ్.హ్..హ్..హ్
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ...ఆ ఆ ఆ .. వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాట రాదు ఆశల వాహిని
అదుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది ... విలువేముంది ఘల్లు ఘల్లు
Ghallu Ghallu Ghallu Mantu Lyrics in English
ghallu ghallu ghallu mantu merupalle tullu
jallu jallu jalluna uppongu ningi ollu
nalla mabbu karagani .. challani chirujallu …………. (2)
pallavinchani nelaku pachhani paravallu
ghallu ghallu ghallu mantoo merupalle tullu
jhallu jhallu jhalluna uppongu ningi ollu
velluvochhi sagani tolakari allarlu ……………… (2)
yellalannave yeragani vegamto vellu ghallu ghallu
layake nilayamai nee paadam saagali ...aha ha ha ha ha
malayaanila gatilo sumabalaga toogali
valalo voduguna viharinche chirugali .. selayetiki natanam nerpinche guruvedi
tirige kaalaaniki .. a a a … tirige kaalaaniki teerokatundi..
adi nee svaardhaniki dorakanu andi ..
nataraja swami jatajootiloki cherakunte
viruchukupadu sura gangaku viluvemundi .. viluvemundi ghallu ghallu
dooke alalaku ye talam vestaru ...aha ha ha ha ha
kammani kalala pata ye ragam antaru um.h..h..h
alalaku anduna ashinchina aakasham
kalla karagadama jeevitaana paramartham
vaddani aapaleru ...a a a .. vaddani aapaleru urike oohani
haddulu data radu ashala vaahini
aduperagani aataladu vasantaalu valadante
viri vanamula parimalamula viluvemundi ... viluvemundi ghallu ghallu
Swarna kamalam Ghallu Ghallu Video Song - Watch Online
hats off for telugu lyrics with no mistakes. you maintained the essence of telugu language. keep it up.
ReplyDelete