Wednesday, 5 May 2010

Dr Chakravarthy Old Telugu Movie : neevu leka veena song lyrics in telugu


చిత్రం : డా.చక్రవర్తి
గాత్రం : పి.సుశీల
రచన : ఆత్రేయ

నీవు లేక వీణా పలుకలేనన్నదీ
నీవు రాక రాధా నిలువలేనన్నది
ఆఆఆ.....ఆఆ....ఆఆ..
నీవు లేక వీణా...

జాజి పూలు నీకై రోజు రోజు పూచె
చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయె
చందమామ నీకై తొంగి తొంగి చూసి …. 2
సరసను లేవని అలుకలుబోయె

నీవు లేక వీణా...

కలలనైన నిన్ను కనుల చూతమన్నా
నిదుర రాని నాకు కలలు కూడ రావె
కదలలేని కాలం విరహ గీతి రీతి …. 2
పరువము వృదగా బరువుగ సాగె

నీవు లేక వీణా..

తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నొ మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలెను స్వామి …. 2
తరుణిని కరుణను యేలగ రావా

నీవు లేక వీణా పలుకలేనన్నది
నీవు రాక రాధా నిలువలేనన్నది
నీవు లేక వీణా.....

Neevu Leka Veena Song Lyrics in English

neevu leka veena palukalenannadi
neevu raaka radha niluvalenannadi
aaa.....aa....aa..
neevu leka veena...

jaji poolu neekai roju roju pooche
choosi choosi papam sommasilli poye
chandamama neekai tongi tongi choosi … 2
sarasanu levani alukaluboye

neevu leka veena...

kalalanaina ninnu kanula chootamanna
nidura rani naku kalalu kooda rave
kadalaleni kaalam viraha geeti reeti …. 2
paruvamu vrudaga baruvuga sage

neevu leka veena..

talupulanni neekai terachi vunchi nanu
talapulenno madilo daachi vechi nanu
taapaminka nenu opalenu swami …. 2
tarunini karunanu elaga rava

neevu leka veena palukalenannadi
neevu raaka radha niluvalenannadi
neevu leka veena.....

No comments:

Post a Comment

Popular Posts