Movie : Naani (2004)
Cast : Mahesh Babu, Amisha Patel
Director : S J Surya
Banner : Indira Creations
Producers : Manjula & Sanjay Swaroop
Release date : 14th May 2004
Music : A R Rahman
Lyricist: Chandrabose
Singers : UnniKrishnan, Sadhna Sargam
pedave palikina matallone teeyani maate... amma
kadile devata amma kantiki velugamma
tanalo mamate kalipi pedutundi muddaga
tana lalipataloni sarigama panchutundi prema madhurima
manaloni pranam amma manadaina roopam amma
yenalaeni jaliguname amma
nadipinche deepam amma karuninche kopam amma
varamichhe teepi shapam amma
na ali ammaga outundaga jo laali padana kammaga kammaga
pottillo yedige babu na ollo odhige babu
iruvuriki nenu ammavvana
na kongu pattevadu na kadupunu puttevadu
iddariki prema andinchana
na chinninannanee vadi naannani noorellu sakna challaga challaga
yedigi yedagani o pasikoona muddulakanna jojo
bangaru tandri jojo bajjo laali jo
palike padame vinaka kanulara nidhurapo
kalaloki nenu cheri tadupari panchutanu prema maadhuri
Naani - Pedave Palikina Song Lyrics in Telugu
చిత్రం: నాని (2004)
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: అల్లారఖా రెహమాన్
నేపథ్యగానం: పి ఉన్నికృష్ణన్ & సాధనా సర్గమ్
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే... అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలిగుణమే అమ్మ..
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ..
నా ఆలి అమ్మగా ఔతుండగా జో లాలి పాడనా కమ్మగా..కమ్మగా
పొత్తిళ్లో ఎదిగే బాబు నా ఒళ్లో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవ్వనా
నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్నినాన్ననీ వాడి నాన్ననీ నూరేళ్లు సాకనా చల్లగా.. చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దులకన్నా జోజో
బంగరు తండ్రీ జోజో.. బజ్జో లాలీ జో..బజ్జో లాలీ జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
Cooooool ! Thanks for sharing !
ReplyDelete