Tuesday, 1 June 2010

Lalijo Lalijo Lyrics, Indhrudu Chandrudu Songs Lyrics

Movie : Indrudu Chandrudu
Music : Ilaiyaraaja
Lyricist : Sirivennela Seetharama Sastry
Singer : S. P. Balasubrahmanyam

లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి..
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి..
తెలుసా ఈ ఊసూ.. చెబుతా తల ఊచు...
కాపురం చేస్తున్నా పావురం ఒకటుంది..
ఆలీనే కాదంది... కాకినే కూడింది....
అంతలో ఏమైంది... అడుగవే పాపాయి...
పారిపోనీకుండా పట్టుకో నా చేయి..

మాయనే నమ్మిందీ... బోయతో పోయింది...
దెయ్యమే పూనిందో... రాయిలా మారింది...
వెళ్లే పెడదారిలో ముల్లె పొడిచాకనే..
తప్పిదం తెలిసింది.. ముప్పునే చూసింది...
ఇంటిలో చోటుందా.. చెప్పవే పాపాయి...
పారిపోనీకుండా పట్టుకో నా చేయి..

పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు...
గుండెలో ఇన్నాళ్లు కొండలే మోశారు...
నేరం నాదైనా.... భారం మీ పైన...
తండ్రినే నేనైనా.. దండమే పెడుతున్నా...
తల్లిలా మన్నించు..... మెల్లగా దండించు...
కాళిలా మారమ్మా... కాలితో తన్నమ్మా....
బుద్ధిలో లోపలే.. దిద్దుకోనివ్వమ్మా....
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి..

LYRICS SUBMITTED by SWAPNA REDDY

No comments:

Post a Comment

Popular Posts