Friday, 7 May 2010

Manchimanasulu Old Telugu Movie : emandoy sreevaaru - old telugu song lyrics


చిత్రం : మంచి మనసులు
గానం : పి.సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం:కె.వి.మహాదేవన్

ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు ఏదీ కాని వేళ ||ఏమండోయ్||

పసివాని చూచుట కీ తొందరా
మైమరచి ముద్దాడి లాలింతురా
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా ||ఏమండోయ్||

అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా.. ||ఏమండోయ్||

ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
అయ్య్యో…. పాపం…..
ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన … 2
కాపురం చేయండి కలకాలము ||ఏమండోయ్||

Movie : Manchi Manasulu
Music : K.V Mahadevan
Singer : Susheela
Lyrics : Arudra

emandoy sreevaru oka chinnamata
ye ooru veltaru edi kani vela ||emandoy||

pasivaani choochuta ki tondaraa
maimarachi muddaadi laalintura
sreematiki bahumatiga emithturo
icchendukemundi mee daggara ||emandoy||

abbayi polika ee tandrida
apuroopamaina a tallida
ayyagari andaalu ranichchina
ee buddhi raneeku bhagavantuda.. ||emandoy||

priyamaina ma illu vidanadipote
ayyooo.. Paapam….
priyamaina ma illu vidanadipote
taladachukona meeku taavaina lede
kapatalu maanesi na madilona …. 2
kaapuram cheyandi kalakaalamu ||emandoy||

No comments:

Post a Comment

Popular Posts