Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Thursday, 13 May 2010
tholisari mimmalni song lyrics in telugu
Movie: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
Lyricist: వేటూరి సుందరరామమూర్తి
Music: రమేశ్ నాయుడు
Singer: జానకి
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా ప్రియానంద భోజా
మీ శ్రీ చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి
మిము వరించి మీ గురించి ఎన్నో కలలుగన్న కన్నె బంగారు
భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు
సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదురపోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్లకు రాస్తున్న... ప్రేమలేఖ
ఏ తల్లి కుమారులో తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ
నా మనసును దోచిన చోరులు మీరు
వలచివచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి.. చప్పున బదులివ్వండి
తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపె
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడె
నీ జతనే కోరుకునే లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి… ఇప్పుడే బదులివ్వండి
Tholisari Mimmalni Song Lyrics in English
sreeman maharaja maartaanda teja priyananda bhoja
mee shree charananbhojamulaku premato namaskarinchi
mimu varinchi mee gurinchi yenno kalaluganna kanne bangaru
bhayamuto bhaktito anuraktito shayamgala vinnapamulu
sandhyaaragam chandrahaarati padutunna vela
masakacheekati madhyamavati padutunna vela
o shubhamuhaoortana
tolisari mimmalni choosindi modalu
kadilayi madilona ennenno kathalau
jo achyutananda jo jo mukunda
laali paramananda rama govinda jo jo
nidhuraponi kanupaapalaku jola padaleka
eela vesi chanputunna eedunapaleka
innallaku rastunna... premalekha
ye talli kumarulo teliyadu kani
yentati sukumarulo telusu naku
yentati magadheerulo teliyaleduganee
na manasunu dochina chorulu meeru
valachivachhina vanitanu chulakana cheyaka
tappulunte manninchi oppuluga bhavinchi
chappuna badulivvandi… chappuna badulivvandi
talalona turumukunna tuntari malle
talapulalo ennenno mantalu repe
sooryudi chuttoo tirige bhoomiki malle
na oorpula nitturpuku jaabili vaade
nee jatane korukune latalaaga allukune
naku meeru manasiste icchinattu matiste
ippude badulivvandi … ippude badulivvandi
Labels:
Janaki,
srivariki premalekha,
Veturi
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Guna Music : Ilayaraja Singers : Balu, Sailaja Kammani Ee PremaLekha Song Lyrics From Guna Telugu Film kammani ee prema...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
Movie : Jilla Cast: Kajal Agarwal, Vijay, Mohanlal Music: D Imman Singers : Mano, Sai Charan Lyrics : Vennelakanti Paadukuntu chindu...
one of the best classic & lively song :)
ReplyDelete